Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న‌ను ప్రేమించాలంటూ విద్యార్థిని గొంతు కోసిన యువ‌కుడు

muder attempt on girl
  • హ‌నుమ‌కొండలోని గోపాల‌పూర్‌లో క‌ల‌క‌లం
  • ఎంసీఏ విద్యార్థిని (23) వెంటపడుతున్న అజ‌హ‌ర్
  • ఈ రోజు ఆమె ఇంటికి వెళ్లి దాడి 
  • బాధితురాలిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన కుటుంబ స‌భ్యులు
హ‌నుమ‌కొండలోని గోపాల‌పూర్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. త‌న‌ను ప్రేమించాలంటూ ఓ విద్యార్థిని (23) వెంటపడుతున్న అజ‌హ‌ర్ అనే యువ‌కుడు ఈ రోజు ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశాడు. ఆ విద్యార్థిని గొంతు కోసి అక్క‌డి నుంచి పారిపోయాడు. బాధిత అమ్మాయిని కుటుంబ స‌భ్యులు, స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విద్యార్థిని ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

బాధితురాలు కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఎంసీఏ చ‌దువుతోంద‌ని ఆమె కుటుంబీకులు మీడియాకు చెప్పారు. కొంత కాలంగా ప్రేమ పేరుతో ఆ విద్యార్థినిని అజ‌హ‌ర్ వేధిస్తున్నాడ‌ని, అత‌డిని ఆమె నిరాక‌రిస్తుండ‌డంతో ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాల‌పై ఆరా తీస్తున్నారు.
Crime News
hanumakonda

More Telugu News